నీ స్వరం కావాలి ఓ కరవాలం
మన్ను
తినెడి
మురళి
ధారుడి
మధుర గానం
తిరగవ్రాసి
పన్ను తినెడి
ప్రజా
ప్రతినిధులు
ప్రజల నిధులను
భక్షించిననాడు
నీ
స్వరం
కావాలి
ఓ
కరవాలం
అశేష ఆంక్షలకై
విశేష
వాంఛలకై
నిశేష జనావలి
ముందు
చేసిన
కఠోర
ప్రతినలను
గుర్తుచేసేందుకై!
రామచంద్రుడి
రామరాజ్యం
వర్ణ
సంస్కృతికి
ప్రతీతి
అంటూ
ఓట్లకోసం
అవితెచ్చే
నోట్లకోసం
కుల
మత
భేదాలను
బలపరుస్తున్ననాడు
నీ స్వరం కావాలి ఓ కరవాలం
కులం
తెలిపేది
కృషితత్వమనీ
మతం
తెలిపేది
మానవత్వమనీ
మదమెక్కిన
అవినీతినాయకులకు
గద్దె
దింపి
గుర్తుచేసేందుకై
!
విశ్వమందు
నా
దేశం
గొప్పదంటూ
దేశమందు నా
రాష్ట్రం
గొప్పదంటూ
రాష్ట్రమందు నా
ప్రాంతం
గొప్పదంటూ
ప్రాంతమందు నా
గ్రామం
గొప్పదంటూ
గర్వించదగ్గ ప్రాంతీయతత్వాన్ని
రాజకీయ స్వార్ధానికి
వాడుకున్ననాడు
నీ
స్వరం
కావాలి
ఓ
కరవాలం
గుండె బలమే
కండ
బలముగ
తెల్ల దొరలను
తరిమికొట్టిన
నా
దేశం
ఏ తెల్లపంచెల దండ
బలముకి
బానిసత్వం వహించబోదని
విభజించి పాలించే
ప్రతి
నాయకుడికీ,
స్వతంత్ర
భారత
చరిత్ర
గుర్తుచేసేందుకై!
స్వదేశ
సంపద
విదేశమేగించి
పరదేశ
దోపిడికి
ఆర్జ్యం
పోసి
అంతర్జాతీయ
సంస్థల
ముందు
సుసంపన్న
భారతాన్ని
బానిసగా
నిలబెట్టిననాడు
నీ స్వరం కావాలి ఓ కరవాలం
జనం
కోసం
జననమంటూ
ప్రతిఫలం
కోరని
శపధం
పూని
క్షణం
తిరగక
అంతా
మరచి
ధనం
ముందర
చేయిచాచే
, నీచ రాజనీతికి
మట్టి
విలువ
గుర్తుచేసేందుకై!
నీ స్వరం కావాలి ఓ కరవాలం
స్వతంత్ర
భారతాన్నికుతంత్ర
రాజకీయాలనుంచి
విముక్తి
చేసేందుకై
!
నీ స్వరం కావాలి ఓ కరవాలం
సప్తవర్ణ
ప్రజాస్వామ్యానికి
స్వార్ధవర్ణ
దగారాజుల
నుంచి,
స్వేచ్ఛను
సంపాదించేందుకై
!
Comments
Post a Comment