ప్రేమ
జీవిత0లో కొన్ని ఆన0దలు అనుభవిస్తేకానీ
తెలీవ0టారు. అలా0టి ఓ అ0దమైన మరపురాని స0ఘటన నేడు నా జీవిత0లో చోటుచేసుకు0ది.
ఎప్పుడూ చెవిలొ ఇయర్ ఫోన్లు పెట్టుకుని తమలో తాము మాట్లాడుకునే
విధ్యార్థులనో, లేక కాళ్ళమీద ల్యాప్ టాప్లు పెట్టుకుని ఏదో దేశకార్యచరన సాగిస్తున్నట్టు కనిపి0చే
కొత్త తరహా ఉద్యోగస్తులనో పరిచయ0 చేసే ధూమశకట0 నేడు నాకో కుటు0భాన్ని అ0ది0చి0ది.
రైలు ఎక్కుతునే ఓ అ0దమైన అనుభూతి. మన కళ్ళ ఎదురుగా
ఎన్నో సార్లు జరుగుతున్నా ఎ0దుకో ఇవాల కొత్తగా చూడముచ్చటగా అనిపి0చి0ది. ఊపిరి
పోసుకుని మూడు నెలలు కూడా కాని ఓ పసి శిశువు, గొ0తుఆర్చుకుపోయేలా గుక్కపట్టి
ఏడుస్తో0ది. తన బిడ్డ ఆరాట0 చూసి ఆ తల్లి మనస్సు తరుక్కుపోయి0ది. బిడ్డని ఒళ్ళో
పెట్టుకుని లాలి పాడడ0 ప్రార0భి0చి0ది. ఆ తల్లి జోలలో కొ0దరికి స0గీత0 వినబడితే
మరి కొ0దరికి సాహిత్య0 కనబడి0ది. కానీ ఆ తల్లిని కన్న తల్లికి మాత్ర0 తన శిశువు కోస0
ఆరాటపడుతున్న తన కూతురి స్వర0లోని అలజడి వినబడి0ది.
ఆ అలజడి విని విలవిలబోయిన ఆ తల్లి తన అనుభవాలనే పాఠాలుగా
మలచి ఆ పసిక0దుకి పరిపరివిధాల ఉపచర్యలు చేయసాగి0ది. ఆ వృధ్ధ మాత చర్యలలోని
తాత్పర్య0 గ్రహి0చి ఆ అమ్మను కన్న అమ్మ దుర్గమ్మ చిరుగాలిలా వచ్చి ఆ బిడ్డను సేదతీర్చి0ది.
ఓ చిరుమ0దహాస0లా మారి తరతరాల ఈ అనుబ0ధాలకు ఊరటనిచ్చి0ది.
ప్రేమ చూపి0చగలిగేది అయితే ఈరోజు నాకు ఎవరెస్టు శిఖరమ0త ఎత్తున కనిపి0చు0డేది. కానీ ఏ0 చేస్తా0 ప్రేమ
అనుభవి0చాల్సి0దేకానీ కనీ వినీ స్పర్శి0చదగినది కాదు కదా. అ0దుకే ఆ శిశువు అధరాలపై
ఓ చిరునవ్వులా ఆ తల్లి క0ట్లో ఓ ఆన0దభాష్ప0లా విశ్వమ0తా ని0డి ఉన్న ప్రేమను ఓ ఉఛ్వాసలా
నా హృదయ0లో ఇముడ్చుకున్నాను.
Comments
Post a Comment